విశాఖలో వైసీపీ నాయకుల ఆందోళన 1 y ago
AP : విశాఖ క్రికెట్ స్టేడియం వద్ద వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. స్టేడియంపై ఉన్న వైఎస్సార్ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. తొలగించిన పేరును యధావిధిగా పెట్టాలని డిమాండ్ చేస్తూ, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనల నేపథ్యంలో వైసీపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.